టీ కాంగ్రెస్ లో రేవంత్ దూకుడు ని తట్టుకోలేకపోతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..?

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాతావరణం నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇవ్వటంతో ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ఒళ్ళు మండిపోయింది. ఇదే క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే పీసీసీ పదవి కూడా ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ కి ఉందని వార్తలు రావడంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర అభిప్రాయ బేధాలు నెలకొన్నాయి. ఇదే క్రమంలో హుజూర్ నగర్ లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పీసీసీ పదవి గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుపోయే నిర్ణయాలను ఎన్నికల వరకు వాయిదా వేయాలని పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ చెప్పకుండా హుజార్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ తన భార్యని ప్రకటించాడు. దీనిపై రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉత్తమ్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలకి మండిపోయింది. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానంపై మండిపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా కానీ ఏమీ పట్టించుకోకుండా దూకుడుగా వెళ్ళటం పట్ల ఉత్తంకుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి దూకుడును తట్టుకోలేక పోతున్నారని తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.