ధోనీకి ప్రత్యామ్నాయాన్ని బీసీసీఐ అన్వేషించాలి: సునీల్ గవాస్కర్

వాస్తవం ప్రతినిధి: క్రికట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి సమయం ఆసన్నమైందని భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ యాజమాన్యం పక్కన పెట్టకముందే… ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని సూచించారు. ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదని… తన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయో ధోనీనే చెప్పాలని అన్నారు. ధోనీ వయసు ప్రస్తుతం 38 ఏళ్లని… టీ20 ప్రపంచ కప్ సమయానికి ఆయన వయసు 39కి చేరుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో, ధోనీకి ప్రత్యామ్నాయాన్ని బీసీసీఐ అన్వేషించాలని సూచించారు.