ఈనెల 24 న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 24వ తేదీన మరోసారి భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో గోదావరి నది జలాలను కృష్ణా నది పరివాహనికి మళ్లించే విషయమై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు తొమ్మిది, పదో షెడ్యూల్ విభజన తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు మూడు దఫాలు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ నెల 24వ తేదీ సమావేశం ఉండనుంది.