జమ్ము కాశ్మీర్‌ అభివృద్ధి ద్వారా పిఒకెను విలీనం చేసుకోవచ్చు: సత్యపాల్‌ మాలిక్‌

వాస్తవం ప్రతినిధి: జమ్ము కాశ్మీర్‌లో అభివృద్ధి చూసి పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఒకె) ప్రజలు భారత్‌లో చేరడానికి ముందుకు వస్తారని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు. పిఒకెను విలీనం చేసుకోవడానికి భారత్‌ ఎలాంటి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని, అక్కడి ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పితే వారే ‘తిరగబడి’ భారత్‌లో చేరడానికి వస్తారని ఆయన అన్నారు. ”గత పది, పదిహేను రోజులనుంచి గమనిస్తున్నాను. మన మంత్రులు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడటానికి అవకాశం లేక, పిఒకెను స్వాధీనం చేసుకోవాలంటూ పదేపదే మాట్లాడుతున్నారు. పిఒకె మన తదుపరి లక్ష్యమని నా భావన. జమ్ము కాశ్మీర్‌లో అభివృద్ధి ద్వారా దానిని మనం తీసుకోవచ్చు” అని సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు.