మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఇ.సి సమీక్ష

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్‌ కమిషన్‌ (ఇ.సి.) నేడు సమీక్ష నిర్వహించనున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్ర ఇప్పటికే ముంబై చేరుకున్నారు. రాష్ట్ర పాలనా యంత్రాంగం, పోలీసు అధికారులతో వారు సమావేశం కానున్నారు. అనంతరం వివిధ పార్టీల నేతలతో వారు సమావేశమై చర్చలు జరుపుతారు. రాష్ట్ర శాసనసభ కాలం నవంబర్‌ 9 వ తేదీతో ముగియనున్నది. మరి కొద్ది రోజుల్లో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తేదీలను ఇ.సి. ప్రకటించనున్నదని తెలిసింది.