వైసీపీ పార్టీలో విజయసాయిరెడ్డికి ఎసరు పెడుతున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు..?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి కీలకంగా ఉండేవారు. అయితే తాజాగా అధికారం చేపట్టాక జగన్ ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా గడుపుతున్న తరుణంలో మరో పక్క విజయ్ సాయి రెడ్డి ఢిల్లీ కి పరిమితమయ్యారు. దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీలో జగన్ తర్వాత బొత్స సత్యనారాయణ కీలకంగా మారారు. గతంలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి పార్టీలో ఏది చెప్తే అది జరిగేది. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఢిల్లీకి పరిమితం కావడంతో ఆ స్థాయిలో వైసీపీ పార్టీలో బొత్సా సత్యనారాయణ రాణిస్తున్నారని చాలామంది పార్టీలో ఉన్న నేతలే మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇందువల్లనే జగన్ మంత్రివర్గంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉన్నా పలు కీలక విషయాలలో వారెవ్వరూ స్పందించడంలేదు. అయితే పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, రాజధాని అంశం కావచ్చు ఇలా అన్నిటిపై బొత్స సత్యనారాయణ మాత్రమే అన్ని తానై వ్యవహరిస్తున్నారని పార్టీలో ఉన్న వారు అంటున్నారు. అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ సైలెంట్ గా ఉంటున్న తరుణంలో బొత్స సత్యనారాయణ మాత్రమే నోరు విప్పుతున్నారని పార్టీలో ఉన్న నేతలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ పార్టీలో జగన్ తర్వాత గతంలో విజయసాయిరెడ్డి ఉండేవారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఢిల్లీకి పరిమితం కావడంతో ఆయనకు ఎసరు పెడుతూ బొత్స సత్యనారాయణ నంబర్ 2 గా మారిపోయారని చాలామంది పార్టీలో ఉన్న నేతలే చర్చించుకుంటున్నారు.