పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొననున్న ఇమ్రాన్‌ఖాన్‌

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నేడు జల్సా (ర్యాలీ)లో పాల్గొనున్నారు. కాశ్మీర్‌కు సంఘీభావం తెలపడానికి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగే ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్‌ పాల్గొంటారు. భారత దళాలు కాశ్మీర్‌ను ఆక్రమించుకున్నాయని, కాశ్మీరీలకు తాము అండగా ఉంటామని ప్రపంచానికి తెలియజెప్పడం ఉద్దేశ్యంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.