ఊహించిందే జరిగింది..కేఎల్ రాహుల్‌కి ఉద్వాసన పలికిన సెలక్టర్లు

వాస్తవం ప్రతినిధి: అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోని కేఎల్ రాహుల్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. ఇవాళ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు రాహుల్‌కి ఉద్వాసన పలికి.. అతని ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్‌కు చోటిచ్చారు.

అటు టెస్ట్ జట్టులోకి వరుసగా ఎంపికవుతున్నా తుది జట్టులోకి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను టెస్ట్ ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్‌ఎస్కే ప్రసాద్ అన్నారు. మూడు టెస్టులకు జట్టును ప్రకటించారు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్‌పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, శుభ్‌మన్‌ గిల్‌