టీడీపీకి రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు

వాస్తవం ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేశారు.ఈ నెల 18న వైసీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలతో ఈరోజు ఆయన సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్న తోట త్రిమూర్తులు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం.

టీడీపీకి రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లూ తనకు కార్యకర్తలు అందించిన సహకారం మర్చిపోలేనిదని చెప్పారు. గెలుపోటములతో ప్రస్తావన లేకుండా ప్రజల మనసు గెలిచానని అన్నారు. ఎన్ని పార్టీలు మారానన్నది ముఖ్యం కాదని, అభివృద్ధే తనకు ముఖ్యం అని తోట త్రిమూర్తులు అన్నారు.