తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా త్యాగదుర్గం వద్ద ఫ్లై ఓవర్‌నుంచి ఒక కారు కిందపడిపోయంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు చెప్పారు.