ఓ చిన్న కేసు కోసం నన్ను నాలుగున్నర గంటల సేపు విచారించారు: సోమిరెడ్డి

వాస్తవం ప్రతినిధి: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇమిడేపల్లి భూ వివాదం కేసులో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ చిన్న కేసు కోసం నాలుగున్నర గంటలు తనను విచారణ చేశారని విమర్శించారు. 2.5 ఎకరాల పొలానికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. కావాలని చెప్పే తనపై కేసు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.