ఇరిగేషన్‌ శాఖపై అధికారులతో సమీక్షిస్తున్న సీ ఎం జగన్

వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇరిగేషన్‌ శాఖపై అధికారులతో సమీక్షిస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్ష సమావేశంలో పోలవరం టెండర్లు, గోదావరి-కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల పరిస్థితులపై సీఎం జగన్‌ చర్చిస్తున్నారు. అలాగే గోదావరి, కృష్ణా వరద నీటి తరలింపుపై కూడా చర్చిస్తున్నారు.