రేవంత్ రెడ్డి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్..?

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం క్షణక్షణానికి మారిపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టడంతో తెలంగాణలో ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యతనిస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుందంటూ తెలంగాణ కాంగ్రెస్ లో వార్తలు వినబడుతున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఎప్పటినుండో ఉన్న సీనియర్లు హైకమాండ్ ఈ పనికి పూనుకుంటే తమ దారి తాము చూసుకుంటామని సీనియర్లు హైకమాండ్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో హైకమాండ్ రేవంత్ రెడ్డికి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను ఒప్పించి పూర్తి అంగీకారంతో నేరుగా ఢిల్లీ కి వస్తే పీసీసీ పదవి ఇస్తామని రేవంత్ రెడ్డికి తెలిపినట్లు సమాచారం.

“పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే అధికారం అందుతుంది. ఆలా కాకుండా ఇలా వర్గాలుగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుంది. నీ విషయంలో అందరు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసుకోవటం నీ బాధ్యత. కాబట్టి సీనియర్లతో మంతనాలు జరిపి ఈ విషయాన్నీ ఒక కొలిక్కి తీసుకోనిరా “అంటూ రేవంత్ రెడ్డికి అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను ఒప్పిస్తారో లేదో చూడాలి.