ఆ ఎమ్మెల్యే చేసిన పనితీరుతో ఒక్కసారిగా షాక్ తిన్న వైసీపీ పార్టీ నాయకులు..!

వాస్తవం ప్రతినిధి: ప్రజలకు అవినీతి లేని ప్రభుత్వాన్ని అందించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ . కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ ప్రజలకు ప్రభుత్వానికి మాత్రమే కనెక్షన్ ఉండేలా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వాల నుండి వచ్చే ప్రతి సంక్షేమాన్ని అనుభవించాలని గ్రామ వాలంటరీ గ్రామ సచివాలయం వంటి వ్యవస్థలను తీసుకు రావడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా జగన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా జగన్ కి సహకరిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రజల కోసమే అన్నట్టుగా సిన్సియర్ గా పని చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చేసిన పనితో ఒక్కసారిగా షాక్ తిన్నారు వైసిపి పార్టీ నాయకులు. విషయంలోకి వెళితే తాజాగా ఇటీవల నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండగ ప్రారంభమయ్యింది. నాలుగు రోజుల పాటు రొట్టెల పండగకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏర్పాట్లను పరిశీలించడానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బారాషహీద్ దర్గా వద్దకు వచ్చారు. అయితే ఏర్పాట్లను పరిశీలించే సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి దర్గా ప్రాంగణంలో పండగకు వచ్చే భక్తులకు స్వాగతం చెబుతూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు కనపడ్డాయి. అయితే ఆయనే స్వయంగా ఆ ప్లెక్సీలను చించేసి దర్గా ప్రాంగణంలో, దేవాలయాల దగ్గర, చర్చీల దగ్గర రాజకీయాలకు తావు లేదని చెప్పారు.