భర్త బరువు లేడు … ఆర్దిక భారమైంది.. సాయం కోసం ఎదురు చూపులు…

వాస్తవం ప్రతినిధి: ఒకే ఒక క్షణం … విధి వంచించింది… వారి అన్యోన్య దాంపత్యం కి బ్రేక్ లు పడ్డాయి… శివ పార్వతుల్లా ఆదర్శ దంపతుల్లా సాగుతున్న వీరి జీవితం కుప్పకూలింది .. భర్త వెన్ను విరిగి కదల్లేకున్నా తన స్వార్థం చూసుకోలేదు ఆ సతి.. పతి యే నాప్రత్యక్ష దైవం అంటూ వెన్నుకు దన్నుగా నిలుస్తూ మోయలేని భారాన్ని మోస్తున్న ఓ అర్దాంగి ధీన గాధ ఇది ..

బంధం ముందు బరువు పెద్ద లెక్కేమి కాదంటూ ఓ మహిళ తన భర్తను భుజానికి ఎక్కించుకుని మోస్తోంది… ఇంతకీ ఎవరు ఈవిడ ..ఎందుకు మోస్తోంది. వారికి కావాల్సింది ఏమిటో తెలియాలంటే మీరు ఈ స్టోరి పూర్తిగా చదవాల్సిందే.. ఈ ఫోటోలో కన్పిస్తున్న ఈమె పేరు కుమారి , ఆమె వీపు మీద ఎక్కింది ఆమె భర్త శివ ప్రసాద్ ..వీరు విజయవాడ నగరంలో చిట్టినగర్ సమీపంలోని కలరా హాస్పటల్ వద్ద నివసిస్తున్నారు.. ఏడేళ్ల క్రితం ఎలక్ట్రికల్ షాపు లో పనిచేసే శివప్రసాద్ , బైండింగ్ షాపులో పనిచేసే కుమారి ల మద్య పరిచయం ఏర్పడింది.. మనసులు కలిసాయి.. కులాలు వేరైనా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2012 లో దంపతులయ్యారు… ఇద్దరు మగపిల్లలు కలిగారు…ఇరువురి సంపాదన తో హాయిగా వారి సంసార జీవితం సాగుతుంది… ఉన్నట్లుండి వీరి బంధాన్ని చూసి కన్నుకుట్టిందో ఏమో ఐదేళ్ల క్రితం ఒకరోజు చిట్టినగర్ కొండ పై ఉండే అత్తగారి ఇంటి వద్ద కు వెళ్లాడు.. పిట్ట గోడపై కూర్చుని ఉండగా అకస్మాత్తుగా గోడ కూలి క్రిందపడిపోయాడు శివప్రసాద్ .. ఇంకేముంది వెన్ను పూస విరిగింది.. కుప్పకూలిపోయాడు.. ఇక అంతే అప్పటి నుండి జీవచ్చవం లాగా మారాడు శివప్రసాద్ .. ఒక్క క్షణంలో సీను మారింది.. అప్పటి వరకు కుటుంబ భారం మోసిన భర్త ఎటూ కదల్లేని పరిస్థితిని చూసి తల్లడిల్లింది భార్య శివకుమారి… ఒక రోజు కాదు ఐదేళ్లుగా చంటి పిల్లవానిలాగా భర్తకు సపర చర్యలు సాగిస్తుంది.. మరో వైపున వారి పిల్లలను పోషించేందుకు అష్టకష్టాలు పడుతోంది.. ఏ రోజు కా రోజు ఎలా గడుస్తుందా అంటూ ధీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. మరో వైపున వారు తలదాచుకునేందుకు సొంత ఇల్లు కూడా లేదు.. అద్దె కు ఇల్లు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.. ఎవరైనా అద్దెకు ఇల్లు ఇచ్చినా సకాలంలో చెల్లించలేక చీవాట్లు చీధరింపులు భరించాల్సి వస్తోంది.. సొంత ఇల్లు కల్పించాలంటూ తొక్కని కార్యాలయంలేదు .ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా ప్రయోజనం శూన్యం.. ఒక వైపున ఇద్దరు పిల్లలు మరో వైపున భర్త పరిస్థితి చూసి ఆమె పడుతున్న మానసిక వేదన అంతా ఇంతకాదు. పగవానికి సైతం ఇంతటి కష్టం రాకూడదు..ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మధర్ ధెరిస్సా స్పూర్తి తో ఇలాంటి వారికి గోరంత సాయం చేస్తే కొండంత అండగా ఉంటుంది.

తమ దయనీయ పరిస్థితిని చూసి మానవతవాదులు దయా హ్రుదులు ఆర్దికంగా సాయం చేయాలని , ఉండటానికి ప్రభుత్వం ఒక ఇల్లు కల్పించాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు. సాయం చేసి అండగా నిలవాలనుకున్న దాతలు శివప్రసాద్ పోన్ నంబర్ ను సంప్రదించగలరు. 8498952765. బ్యాంక్ ఖాతానంబర్ 5201012493196 , ఐఎఫ్ ఎస్ సి :  CORP0000127, కార్పోరేషన్ బ్యాంక్ .విజయవాడ