హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

వాస్తవం ప్రతినిధి : గవర్నర్‌గా ప్రమాణం చేయడం తన జీవితంలో నూతన అధ్యాయం అని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయాల్లో, ప్రజా జీవితంలో అంకితభావంతో పని చేశాను. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాను. పర్యాటకంలో దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తాం. బడుగు, బలహీన, కార్మిక వర్గాలకు లబ్ది చేకూరేలా ప్రయత్నిస్తాను. అధికార, విపక్షాలను కలుపుకుని హిమాచల్‌ప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తాను. విద్య, అడవులు, ప్రకృతి, గిరిజనుల అంశాలపై కృషి చేస్తాను. రాజ్యాంగ పదవి చేపట్టిన నేను రాజకీయాలపై ప్రస్తావించాను’ అని దత్తాత్రేయ స్పష్టం చేశారు.