ఇరాక్‌లోని షియాల పవిత్ర స్థలం వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: ఇరాక్‌లోని షియాల పవిత్ర స్థలం వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరగవచ్చునని, గాయపడిన వారిలో తొమ్మిదిమంది పరిస్థితి విషమంగా ఉందని ఇరాక్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సైఫ్‌ అల్‌-బదర్‌ చెప్పారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కు 60 మైళ్ల దూరంలోని కర్బలాకు అనేక దేశాలనుంచి షియాలు పెద్దయెత్తున వచ్చారు. వారు నినాదాలు చేస్తూ ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.