రాహుల్ స్థానంలో రోహిత్ శర్మ

వాస్తవం ప్రతినిధి : వెస్టిండీస్ పర్యటనలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రాహుల్‌కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. విండీస్‌తో ఆడిన రెండు టెస్టుల్లో రాహుల్ కేవలం 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టి.. విఫలమవుతున్న రాహుల్‌నే జట్టులోకి తీసుకోవడం పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో సెలెక్టర్లు దిగి వచ్చినట్లు ఉన్నారు. రాహుల్ స్థానంలో రోహిత్ శర్మను ఓపెనర్‌గా తీసుకుంటామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. గతంలో రాహుల్ ఇకపై టెస్టుల్లో ఓపెనర్‌గా ఉండటం పట్ల అనుమానం వ్యక్తం చేసిన గంగూలీ మాటలు నెమ్మదిగా నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.