రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలు, మాజీ మంత్రుల గృహ నిర్బంధం

వాస్తవం ప్రతినిధి : చలో ఆత్మకూరు నేపథ్యంలో పోలీసులు రాష్రవ్యప్తంగా టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. చలో ఆత్మకూరుకు బయల్దేరకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలు, మాజీ మంత్రులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో వర్ల రామయ్య, ప్రత్తిపాటి, దేవినేని, బుద్దా వెంకన్నలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసును పోలీసులు గృహనిర్బంధం చేశారు.