ఎందుకు హౌస్‌ అరెస్టు చేస్తున్నారో చెప్పండి: లోకేష్

వాస్తవం ప్రతినిధి : తెలుగుదేశం నాయకుడు నారా లోకేశ్‌ను ఆత్మకూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. దీనిపై లోకేశ్‌ మండిపడ్డారు. ఏ కారణంగా హౌస్‌ అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆత్మకూరులో 144 సెక్షన్‌ ఉంటే ఉండవల్లిలో ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.