నేడు కీలక అంశాలపై సీ ఎం జగన్ సమీక్ష

వాస్తవం ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలో ఉదయం 10.40గంటలకు సీఎం సమీక్ష చేయనున్నారు. కొత్త ఇసుక విధానం, గ్రామ – వార్డు సచివాలయాలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు స్పందన కార్యక్రమంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.