వైసీపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా నిలవదు: దేవినేని

వాస్తవం ప్రతినిధి : వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల వరకు ఉండబోదని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జమిలి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం నిలవదని చెప్పారు. రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని తనంతట తానే జగన్ రద్దు చేస్తారని తెలిపారు. అతి తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ అప్రతిష్టను మూటకట్టుకున్న పార్టీ ఈ దేశంలో వైసీపీనే అని ఎద్దేవా చేశారు. రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పిన జగన్… ఇప్పుడు పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు.