చింతమనేని ప్రభాకర్‌ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత

వాస్తవం ప్రతినిధి : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చింతమనేని ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు కార్యకర్తలు కూడా చేరుకున్నారు. పోలీసులకు, అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇంట్లో సోదాలు చేస్తామని చెప్పి… ఇల్లంతా చిందరవందర చేశారని.. వస్తువులను పగులగొట్టారని ఇంట్లో ఉండే వర్కర్స్‌ ఆరోపించారు. ఇల్లంతా చూపించినా.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు. చింతమనేని అనుచరులు సైతం పోలీసులను నిలదీశారు.