అలాంటి ఆశతో బీజేపీ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తే మాత్రం వృథా అవుతుంది : మురళీధర్ రావు

వాస్తవం ప్రతినిధి : బీజేపీలో చేరితే కేసుల నుంచి విముక్తి కలుగుతుందనే భ్రమలు ఎవ్వరూ పెట్టుకోవద్దనీ.. అలాంటి ఆశతో పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తే అది వృథా అవుతుందని బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మురళీధర్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైందని అన్నారు. ఇక భవిష్యత్తులో కూడా టీడీపీకి గెలిచే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు కమలం గూటికి చేరేందుకు చర్చలు జరిపారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలుస్తోంది. ఇక త్వరలో ఏపీలో కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. అంతేకాదు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వస్తున్న నేతలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే చాలా మంది బీజేపీలోకి వస్తున్నారని అన్నారు.

ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకోవటాలు మామూలయ్యాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైన కేసులో ఇరుక్కున్నవారు వాటి నుంచి తప్పించుకోవడానికి పార్టీలు మారుతున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ఉన్నట్టుండి బీజేపీలోకి జెంప్ చేశారు. అయితే ఆయన పార్టీ మార్పు పై మురళీధర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బాబ్రీ మసీదు కేసు నుంచి తప్పించుకునేందుకే కమలం గూటికి వచ్చారని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. ఐటీ దాడులకు.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారాయన.