టీడీపీ అధినేత చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

వాస్తవం ప్రతినిధి : ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసిన పోలీసులు… గేట్లను తాళ్లతో బంధించారు. గేటు వెలుపల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు పలువురు కీలక నేతలు, పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు.

ఇంటి నుంచి బయటకు రావడానికి చంద్రబాబు తన వాహనంలో కూర్చున్నప్పటికీ… పోలీసులు గేటు తీయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని మండిపడ్డారు.