మైసూరు దసరా ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా పీవీ సింధుకు ఆహ్వానం

వాస్తవం ప్రతినిధి : మైసూరు దసరా ఉత్సవాలకు స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఆహ్వానం అందింది. ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా పీవీ సింధును కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. అక్టోబర్ 1న యువ దసరా 2019 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సింధు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.