సైరా వేడుకకు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా..?

వాస్తవం సినిమా: అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు నిర్మాత రామ్ చరణ్. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక సినిమాలో చిరంజీవి చేసిన యాక్షన్ చూసి కచ్చితంగా అవుట్ పుట్ అదిరిపోతుందని చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు కామెంట్ చేశారు.

ఇటువంటి నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను కర్నూల్ ప్రాంతంలో రంగ రంగ వైభవంగా చేయటానికి నిర్మాత రామ్ చరణ్ సిద్ధమయ్యారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మెగా కాంపౌండ్ నుండి పెద్ద హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ కావడంతో మెగా అభిమానులు కూడా సైరా సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ తన వాయిస్ ఓవర్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఈ ప్రి- రిలీజ్ వేడుకకు హాజరైతే మాత్రం మెగా అభిమానులకు పూనకాలే అని చాలామంది అంటున్నారు.