ఆదివారం ఎపిసోడ్ అంతా ఎమోషనల్.. బిగ్ బాస్ హౌస్ సభ్యులంతా కంటతడి..!

వాస్తవం సినిమా: ఆదివారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో అలీ రెజా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవటం అందరికీ షాక్ కి గురి చేసింది. ఇంటి సభ్యులు ఎవరు అలీ రెజా ఎలిమినేట్ అవుతారని నమ్మలేక పోయారు. బిగ్ బాస్ షో ప్రారంభమైన సందర్భంలో నాగార్జునతో పాటు నాని కొంతసేపు ఎంటర్టైన్ చేశాక మొదలైన ఎలిమినేషన్ రౌండ్ లో అలీ రెజా, శ్రీముఖి, మహేష్ విట్టా, రవికృష్ణ మిగిలి ఉన్నారు. శనివారం రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యారు. దీంతో ఆదివారం జరిగిన ఎపిసోడ్ కి అలీ రెజా, శ్రీముఖి, మహేష్ విట్టా, రవికృష్ణ మిగిలి ఉండగా శ్రీముఖి సేఫ్ అయ్యారు. అయితే ఆ తర్వాత అలీ రెజా ఎలిమినేట్ అయ్యి రవి కృష్ణ, మహేష్ విట్టా సేఫ్ అయ్యారు. అయితే అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున ప్రకటించడంతో హౌస్‌లో అందరూ షాక్ అయ్యారు. ఇక శివజ్యోతి, శ్రీముఖి, హిమజ ఏడుపు మొదలుపెట్టారు. రవి, రాహుల్, వరుణ్ సందేశ్ ఇలా అందరూ ఎమోషనల్ అయ్యారు. శ్రీముఖి, శివజ్యోతి అయితే వెక్కి వెక్కి ఏడ్చారు. ముఖ్యంగా హౌస్ లో రాహుల్, రవిలు ఏడవడం అందరికీ షాక్ కి గురి చేసింది. మొత్తం మీద బిగ్ బాస్ షో ఇప్పటిదాకా జరిగిన ఎపిసోడ్ లో ఇటీవల ఆదివారం జరిగిన ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించినటు నెటిజన్లు పేర్కొంటున్నారు.