సైరా’ సినిమా కి హైలెట్ సీన్ ఇదే..!

వాస్తవం సినిమా: స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ‘సైరా’ సినిమా త్వరలో విడుదల కానుంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా రామ్ చరణ్ నిర్మించారు.

కొణిదెల వారి ప్రొడక్షన్స్ పై నిర్మించిన ఈ సినిమా…ప్రమోషన్ కార్యక్రమాలు అదరగొట్టే రీతిలో ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన హైలెట్ సీన్స్ అంటూ ఫిలింనగర్లో కామెంట్ లో వినపడుతున్నాయి. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో అనుష్క నటిస్తున్నట్లు కథ ఆమె నోట నుండి మొదలు కాబోతుందట.

మరి అదేవిధంగా సినిమాలో టైటిల్ సాంగ్ ఐదు నిమిషాలకు మిం చి ఉంటున్నట్లు, సినిమాకి టైటిల్ సాంగ్ కూడా హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే సినిమాకి హైలైట్ సన్నివేశం మాత్రం..అదే అండర్ వాటర్ ఫైట్. తమన్నా, చిరంజీవి, ఫైటర్ల మధ్య ఉండే ఈ ఫైట్ కోసం విదేశీ టెక్నీషియన్లు పని చేశారు. ఈ ఒక్క ఫైట్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరియు అదే విధంగా క్లైమాక్స్ కూడా చాలా భావోద్వేగంగా ఉంటున్నట్లు సమాచారం. భారీ తారాగాణంతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.