ఇలియానా పెళ్లి పెటాకులు అవటానికి కారణం అదేనా..!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీ , మరియు సౌత్ ఇండస్ట్రీలలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్న స్టార్ హీరోయిన్ ఇలియానా. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి పక్కన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. వరుస విజయాలతో మంచి టైమింగ్ లో ఉన్న ఇలియానా…బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో తెలుగులో చేయాలని చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా వదులుకుంది.

ఇటువంటి క్రమంలో ఇలియానా సినిమాలు మానేసి ఆండ్రూ తో ప్రేమలో పడింది. పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అయితే తాజాగా ఇలియానా పెళ్లి పెటాకులు అయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. కారణం డబ్బు అని చాలామంది అంటున్నారు.

విషయంలోకి వెళితే ఇలియానా సినిమాలు మానేసి ఆండ్రూని పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండాలని అనుకుందట. ఆ విషయాన్ని ఆండ్రూకి ముందుగానే చెప్పిందట. అప్పుడు ఎలాంటి సమస్య లేదని చెప్పిన ఆండ్రూ ఆ తరువాత మాత్రం ఇలియానాని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడట. దీంతో ఇలియానా ఆండ్రూతో బ్రేకప్ చేసుకొని మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిందట. ప్రస్తుతం గతంలో లాగా సన్నగా నాజూగ్గా ఉండటానికి ఇలియానా జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం.