జమ్మూ కాశ్మీర్లో ‘ లష్కరే ‘ క్రీనీడలు..8 మంది ఉగ్రవాదుల అరెస్ట్

వాస్తవం ప్రతినిధి : జమ్మూ కాశ్మీర్లో ‘ లష్కరే ‘ క్రీనీడలు కనబడుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు, అవసరమైతే ఆత్మాహుతికి సిధ్ధపడేందుకు కస్మీర్ లోకి దొంగచాటుగా ప్రవేశించిన 8 మంది లష్కరే ఉగ్రవాదుల ను భద్రతా దళాలు అరెస్టు చేశారు. దక్షిణ కాశ్మీర్లోని సోపోర్ లో స్థానికులను భయపెడుతూ.. బెదిరింపు పోస్టర్లను సర్క్యులేట్ చేస్తున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేసి పోస్టర్లను తయారు చేసేందుకు వినియోగించే కంప్యూటర్లను, ఇతర సామాగ్రిని వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టణంలో టెర్రరిస్టులు ఓ చిన్నారితో సహా నలుగురిని గాయపరచిన రెండు రోజుల అనంతరం ఈ ఎనిమిది మందీ పట్టుబడ్డారు.

ఆగస్టు మొదటివారంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను సైన్యం తాజాగా విడుదల చేసింది. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ కు చెందిన అయిదుగురి మృతదేహాలను, వారి తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక్కడ ఉగ్రవాద దాడి జరగవచ్ఛునని తమకు సమాచారం అందిందని, అందువల్ల కనీవినీ ఎరుగని భద్రతను కల్పించామని వారు చెప్పారు. గుజరాత్ లోని సర్ క్రీక్ జలసంధి వద్ద ఉగ్రవాదులు వదిలి వెళ్లిన కొన్ని పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వారు పేర్కొన్నారు.