విజయసాయిరెడ్డికి సీఎం పీఠంపై కన్ను ఉందా..?

వాస్తవం ప్రతినిధి: అప్పట్లో చంద్రబాబు టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు ఎలా పొడిచారో ఇప్పుడు అదే విధంగా వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ని విజయసాయిరెడ్డి చేయనున్నట్టు సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ కి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీలో జగన్ తర్వాత ఎక్కువగా వినబడే పేరు విజయ సాయి రెడ్డి. దాదాపు మూడు తరాల వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా విజయ్ సాయి రెడ్డి కుటుంబం ఉంది.

ఇటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత వైసిపి పార్టీలో విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్న శైలిపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి పీఠంపై కన్ను ఉందని కానీ అది బయట పడకుండా సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారని వేరే పార్టీలకు చెందిన నేతలు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి పెట్టిన పోస్ట్ కి కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిన సందర్భంలో చంద్రబాబును విమర్శిస్తూనే జగన్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారా అన్న అనుమానం ఈ ట్వీట్ ను చూస్తే ఎవరికీ అయినా కలుగుతుంది.

“బాసేమో 18 కేసుల్లో స్టే తెచ్చుకుని తాను పత్తిగింజనని చెప్పుకుంటారు. బానిసలేమో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్నిపంపిణీ చేస్తే కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. మూడు పూటలా ఇసుక బొక్కినోళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుసు?” అంటూ పెట్టారు. దీంతో జగన్ ని ఉద్దేశించే విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని చాలా మంది అంటున్నారు.