రోజు రోజుకి చిదంబరం చేసిన అవినీతి బయటపడుతోంది…!

వాస్తవం ప్రతినిధి : ఇప్పటికే పలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడి తిహార్ జైలు లో చిప్పకూడు తింటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పై ఆయన చేసిన అవినీతిపై రోజురోజుకీ కొత్త కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఇటీవల ఎంసీఎక్స్‌-ఎ్‌సఎక్స్‌, నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు జిగ్నేశ్‌ షా మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వల్లే చాలావరకు నష్టపోయానని, వ్యాపారాలలో దెబ్బ తిన్నాను అని కుప్పకూలి పోవడం జరిగిందని ఆరోపించారు. గతంలో కేంద్రంలో అధికారంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో కొంతమంది ట్రేడర్లు.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) టెర్మినళ్లకు సమీపంలోనే తమ టెర్మినళ్లను ఏర్పాటు చేసుకుని ట్రేడింగ్‌ చేయటం అతి పెద్ద ఘరానా మోసమని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం వల్ల రెప్పపాటు సమయంలోనే కొంతమంది బ్రోకర్లు రూ.వందల కోట్లు అక్రమంగా సంపాదించుకన్నారని ఆయన అన్నారు. ఈ రెండు ఘరానా నేరాల వెనుక చిదంబరం, అతని సన్నిహితుల పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించాలని షా విజ్ఞప్తి చేశారు. మరోపక్క జాతీయ కాంగ్రెస్ పార్టీ చిదంబరంపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసుల విషయమై ధర్నాలు నిర్వహించాలని చిదంబరం అరెస్ట్ అక్రమమని పేర్కొంటుంది.