మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ దక్కించుకున్న తెలుగమ్మాయి ఈషా కోడె

వాస్తవం ప్రతినిధి: అందాల పోటీల్లో తెలుగు అందం మెరిసింది. ప్రవాస భారతీయుల్లో ఎవరు అందాల సుందరి అనే పోటీల్లో తెలుగు ఆణిముత్యానికి కిరీటం దక్కింది. సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు ముంబైలో జరిగిన మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 పోటీల్లో ఈషా కోడె సత్తా చాటి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారతదేశం నుంచి వలస వెళ్లి వివిధ దేశాల్లో నివాసముంటున్న ప్రవాస భారతీయుల్లోని యుక్త వయస్సు యువతుల మధ్య ఈ పోటీ జరిగింది.

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, ఓమెన్, ఫిజి, మారిషస్, మలేషియా, సింగపూర్, హంగేరి, గునియా, జర్మనీ, సురనమ్, కెన్యా, గ్వాండ్, కోస్టారికా, ఐర్లాండ్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయ యువతులు 39 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారిలో ఏడుగురు మిస్ టీన్ వరల్డ్ వైడ్ కంటెస్టంట్లు ఉన్నారు. వీరిలో ఈషా కోడె కూడా ఒకరు. ఐదు రోజుల పాటు వీరి మధ్య జరిగిన పోటీల్లో ఈషా కోడె విజేతగా నిలిచి మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 టైటిల్ దక్కించుకుంది.