అమెరికాలో ఒంగోలు యువతి అంబికాశ్రీ ప్రతిభ

వాస్తవం ప్రతినిధి: పాశ్చాత్య దేశంలో ఉ న్నప్పటికీ, మనవైన సంప్రదాయ కళల పట్ల ఎంతో మక్కువ చూపిస్తూ రాణిస్తోంది ఒంగోలుకు చెందిన ‘శిద్దాబత్తుల అంబిక శ్రీ’.

చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూచిపూడి నృత్యంలో శిక్షణ పొంది మంచి అభినయం కలిగిన నృత్య కళా కారిణిగా గుర్తింపు పొందటమే కాకుండా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో నృత్యా న్ని ప్రదర్శించే అవకాశం అమెకు కలి గింది.

ఎంతోమంది అమెరికా, ప్రవాస భారతీయ ప్రముఖుల సమక్షంలో ఆమె తన నృత్యప్రదర్శనతో వారి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా అతి చిన్నవయసులో తన నృత్యానికి గాను 2008లో కాలిఫోర్నియాలో, 2012లో హైదరాబాదులో జరిగిన ప్రదర్శనల్లో ఆమె గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.

ఇక వివిధ సందర్భాల్లో అమెరికా పర్యటనకు వెళ్లిన తెలుగు కళారంగ, సినీరంగ ప్రముఖుల సమక్షంలో ఆమె తన ప్రదర్శనతో వారి నుంచి ప్రశంసలు పొందింది  మన నృ త్యకళను అభ్యసిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతోంది అంబిక శ్రీ.