చంద్రబాబు ని వదలని రామ్ గోపాల్ వర్మ..!

వాస్తవం సినిమా: గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి అటు రాజకీయాలలో ఇటు సినిమా రంగంలోనూ సంచలనం సృష్టించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేయకుండా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా అనేక ఆటంకాలు సృష్టించినట్లు వార్తలు రావడం జరిగాయి. దీంతో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారటంతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ని వదలటం లేదు రామ్ గోపాల్ వర్మ. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా ఇస్తున్నట్లు ప్రకటించి తాజాగా ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. పోస్టర్ లో చంద్రబాబు ఏడుస్తున్నట్లు ఫోటోను విడుదల చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు రాంగోపాల్ వర్మ. విడుదలైన ఫోటో చూస్తుంటే బాబు చాలా సీరియస్ గా విలనిజం ఉట్టి పడేట్లుగా వుంది. పోస్టర్ లోనే చంద్రబాబు ని ఇలా చూపించాడు అంటే…సినిమాలో చంద్రబాబు పాత్ర ఇంకా ఎలా ఉంటుందోనని సోషల్ మీడియాలో నెటిజన్లు డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు.