హాస్పిటల్లో ‘సాహో’ సినిమా డైరెక్టర్..?

వాస్తవం సినిమా: సాహో సినిమా డైరెక్టర్ సుజిత్ ఇటీవల హైదరాబాద్ నగరంలో హాస్పిటల్లో జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి సాహో డైరెక్టర్ సుజిత్ జ్వరంతో బాధపడుతున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం. అయితే డెంగ్యూ జ్వరం వచ్చినట్లు గుర్తించడంతో సుజిత్ ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. డెంగ్యూ అని తెలిసిన తరువాత కూడా మొదటి రెండు రోజులు ఇంట్లోనే తన తల్లి సంరక్షణలో మెడిసిన్ తీసుకున్నారట. కానీ శుక్రవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. ‘సాహో’ సినిమాకి వచ్చిన విమర్శలు కూడా ఆయన భరించలేకపోయారని.. సైకలాజికల్ కూడా బాగా డిస్టర్బ్ అయ్యారని సమాచారం. ‘సాహో’ సినిమా విషయంలో సుజీత్ ని పెర్సనల్ గా ఎటాక్ చేయడం, కామెంట్స్ చేయడం వంటి విషయాలు తనను మరింత ఒత్తిడికి గురి చేశాయని సుజీత్ సన్నిహితులు చెబుతున్నారు.