పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జగన్..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఇప్పటికే చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తన మార్క్ పాలన ఉండే విధంగా ప్రతి విషయంలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ విపక్ష పార్టీకి చెందిన నేతలకు అందనంత స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అదిరిపోయే పరిపాలన అందిస్తున్న జగన్ తాను గతంలో ప్రతిపక్షం లో ఉన్న సమయంలో చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ నేపథ్యంలో గతంలో శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వారికి సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి గతంలో వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఉద్దాన ప్రాంతానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మంచినీటి పథకానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ ఈ విధంగా మాట్లాడారు…తాను ఎన్నికలకు ముందు జరిపిన పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్ని హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తానని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు శంఖుస్థాపన చేస్తున్నానని సీఎం జగన్ ప్రకటించారు. అంతేకాకుండా ” డయాలిసిస్ జరుగుతోన్న పేషెంట్ లకు పది వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని మరియు పది వేల పెన్షన్ ను డయాలసిస్ స్టేజ్ 5 లో ఉన్న కిడ్నీ బాధితులకు అందజేస్తాము ” అని సీఎం జగన్ తెలిపారు.