యూఎస్ ఓపెన్ ఫైనల్ లో సెరీనా విలియమ్స్ పరాజయం

వాస్తవం ప్రతినిధి: యూఎస్ ఓపెన్ ఫైనల్ లో సెరీనా విలియమ్స్ పరాజయం పాలైంది. ఫైనల్ లో బియాంకా అండ్రెస్కూతో జరిగిన మ్యాచ్ లో సెరేనా 3-6, 5-7 తేడాతో పరాజయం పాలైంది. దీంతో యూఎస్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుని రికార్డ్ సాధించాలని భావించిన సెరీనాకు నిరాశ తప్పలేదు. ఇలా ఉండగా ఇటీవల సెరీన ఒక ఫైనల్ మ్యాచ్ లో పరాజయం పాలు కావడం ఇది వరుసగా నాలుగో సారి. బియాంకా అండ్రెస్కూ ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్ లో విజయం సాధించడం ఇదే తొలి సారి.