భారత్ పట్ల, ఇస్రో శాస్త్రవేత్తల పట్ల గర్వంగా ఉంది: భూటాన్ ప్రధాని

వాస్తవం ప్రతినిధి: భారత్ పట్ల, ఇస్రో శాస్త్రవేత్తల పట్ల గర్వంగా ఉందని భూటాన్ ప్రధాని షెరింగ్ అన్నారు. చంద్రయాన్ -2 ప్రయోగంపై ఆయన స్పందించారు. చంద్రయాన్ -2లో చివరి నిమిషంలో కొన్ని అవాంతరాలు వచ్చాయన్నారు. మీరు చూపిన తెగువ, శ్రమ వృథా కావని అన్నారు. ప్రధాని మోడీ, ఇస్రో బృందం ఎప్పటికైనా సాధిస్తారనడంలో సందేహం లేదన్నారు.