లక్ష్యాన్ని చేరుకునే ఆఖరి క్షణంలో…

వాస్తవం ప్రతినిధి: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 లక్ష్యాన్ని చేరుకునే ఆఖరి క్షణంలో కమ్యూనికేషన్ కట్ అయ్యింది. దీంతో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రుడిపై ల్యాండ్ కావడానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో 3,84వేల కిలోమీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించి లక్ష్యానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా సంకేతాలు నిలిచిపోవడంతో సర్వత్రా ఉత్కంఠ, ఆందోళన నెలకొంది. అయితే ఇస్రోచైర్మన్ మాత్రం ల్యాండింగ్ విజయవంతమైందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు.