సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచేందుకు యత్నిస్తున్న పాక్

వాస్తవం ప్రతినిధి: సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచేందుకు పాకిస్థాన్ యత్నిస్తోంది. ఈ ఉదయం జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న పూంచ్ జిల్లా కృష్ణ ఘరి సెక్టార్ లో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, మన సైనికులు వారి దాడులను సమర్థంగా తిప్పికొట్టారు. మన సైనికులు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడంతో పాక్ సైనికులు తోక ముడిచారు. మరోవైపు, భారత భూభాగంలోకి ఉగ్రవాదులను జొప్పించేందుకు పాక్ సైన్యం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, సరిహద్దుల్లో భారత బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి.