ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందు వులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ శుభ దినాన భక్తుల సమస్యలు తొలిగి పోయి వారి ప్రయత్నాలు విజయవంతమయ్యేలా ఆ వినాయకుడు ఆశీర్వదించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. ప్రజలంతా శాంతి సామ రస్యాలతో జీవించేలా గణేశుడు ఆశీర్వదించాలని కోరుతున్నట్లు గవర్నర్‌ తెలిపారు.