సాహో- రివ్యూ

టైటిల్‌: సాహో
న‌టీన‌టులు: ప్రభాస్, శ్ర‌ద్ధాక‌పూర్‌, జాకీష్రాప్‌, నీల్‌నితిన్ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు
జాన‌ర్‌: యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ది
నేప‌థ్య సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత‌లు: ప‌్ర‌మోద్ – వంశీ
క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం: సుజీత్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 172 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 30 ఆగ‌స్టు, 2019

రేటింగ్: 3/5

 వాస్తవం సినిమా: ఒకే ఒక్క బాహుబలి సీరీస్ తో pan india స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఈ రోజు ప్రభాస్ నుంచి వచ్చే ఏ సినిమా అయినా సరే దేశవ్యాప్తంగా అందరి మనసులలో గుర్తుండిపోయే విధంగా రావాలి అని ప్రతీ ప్రేక్షకుడూ కోరుకునే స్థాయి కి బాహుబలి తో ప్రభాస్ ఎదిగాడు అని చెప్పచ్చు . కేవలం భారతీయ సినిమా అభిమానులే కాకుండా జెర్మనీ నుంచి చైనా వరకూ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే పడి చచ్చే పరిస్తితి ఉంది. మరి సాహో లాంటి సంచలనాత్మక చిత్రం ప్రభాస్ కెరీర్ కి ఎంత వరకూ హెల్ప్ అయ్యింది ? బాహుబలి సీరీస్ తోనే కాదు ఒంటరిగా కూడా ప్రభాస్ సాహో లాంటి సినిమా తో  తనని తాను నిరూపించుకోగలను అని రుజువు చేసుకున్నాడా అనేది చూద్దాం రండి ..

కథ & విశ్లేషణ – ముంబై లో జరిగిన 2000 కోట్ల దొంగతనం తో మొదలై 2 లక్షల కోట్ల  చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కథ మొత్తం .. సెకండ్ హాఫ్ నుంచీ గాంగ్ స్టర్ లు ఉండే  వాజీ సిటి మీదకి సినిమా స్టోరీ టర్న్ అవుతుంది. అతిపెద్ద దొంగతనం కేస్ ని డీల్ చెయ్యడానికి పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు .. అతనికి ఆ దొంగ తనానికి సంబంధం ఏంటి , వాజీ సిటి అనేది ఎక్కడ ఉంటుంది .. దాన్ని ప్రభాస్ ఎలా చేధిస్తాడు ? అక్కడ అంతమంది గాంగ్ స్టర్ లు ఎందుకు ఉన్నారు ? వాళ్ళతో ప్రభాస్ పోరాడాల్సిన పరిస్తితి ఎందుకు వచ్చింది .. మధ్యలో తన సహచర పోలీస్ ఆఫీసర్ శ్రద్ధ కపూర్ తో ప్రభాస్ ఎలా ప్రేమలో పడ్డాడు ఇవన్నీ తెరమీద చూడాల్సిందే .

ప్ల‌స్ పాయింట్స్ (+)

ప్రభాస్ లాంటి ఇండియన్ సూపర్ స్టార్ ని ఎంత స్టైలిష్ గా చూపించాలో అలా చూపించాడు డైరెక్టర్ సుజీత్. ప్రభాస్ కాస్ట్యూమ్స్ , ఆహార్యం , స్టయిల్ , మ్యానరిజం లు అద్దిరిపోయాయి. సినిమా లో పాటల చిత్రీకరణ చాలా బాగా తీశాడు , ముఖ్యంగా ఘిబ్రన్ ఇచ్చిన మ్యూజిక్ హై లైట్ గా నిలుస్తుంది. ఆఖరి నలభై నిమిషాలలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు ఇండియన్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. శ్రద్ద కపూర్ గ్లామర్ అదనపు ఆకర్షణ.

మైన‌స్ పాయింట్స్ (-)

 ఎంతో మంచి యాక్షన్ సీక్వెన్స్ లూ, ఫైట్ లూ , స్టంట్ లూ ప్లాన్ చేసిన సుజీత్ వాటిని తెరమీద కూడా అంతే అధ్బుతంగా చూపించాడు .. కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్ ల చుట్టూ కథ మాత్రం చాలా పేలవంగా రాసుకొచ్చాడు. అతని మొదటి సినిమా రన్ రాజా రన్ లోనే లైన్ నే ఇక్కడ కూడా తీసుకుని దాన్ని గాంగ్ స్టర్ లకి మార్చేశాడు. ఎక్కడికక్కడ సినిమా లో రాబోయే ట్విస్ట్ ఏంటి అనేది చాలా తేలికగా ప్రేక్షకుడు కనిపెట్టేస్తాడు. ఫాన్స్ కి బాగుంటుంది కానీ సాధారణ ప్రేక్షకులకి వారి సహనం పరీక్షిస్తున్నట్టు గా అనిపిస్తుంది. వెన్నెల కిశోర్ కారెక్టర్ ఎందుకు ఉందో కూడా అర్ధం కాదు, ఎక్కడికక్కడ ప్యాచ్ వర్క్ అలాగే ఉండిపోయింది .. ఎడిటింగ్ బాలేదు , సీన్ సీన్ కీ అసలు సింక్ అవ్వలేదు అనేది సదరు సాధారణ ప్రేక్షకుడి ప్రధాన కంప్లయింట్. అంతా బడ్జెట్ లో చాలా చక్కటి స్టోరీ ని పొందుపరిచి , చాలా జాగ్రత్తగా తీసుకోవడం తెలిసి ఉండాలి డైరెక్టర్ కి.

మొత్తంగా :

బాహుబలి లాంటి చిత్రం తరవాత ప్రభాస్ కి ఎలాంటి సినిమా రాకూడదో అలాంటిదే సాహో .. ఓవర్ ఫైట్ లూ, యాక్షన్ డ్రామాలు , CGI వర్క్ తప్ప .. కథ అనేది ఏ కోశానా కనపడని చిత్రం ఇది. ఆఖరి లో వచ్చే పోరాట సన్నివేశాల కోసం ఒక్కసారి చూడచ్చు తప్ప .. కథనం కానీ , పాటలు కానీ , హీరో హీరోయిన్ ల కెమిస్ట్రీ కానీ ఏ మాత్రం ఆకట్టుకోలేదు . మూడు వందల కోట్ల(share) ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ మేరకు రాబట్టుకోవడం అసాధ్యం అనే చెప్పాలి  .