తమిళనాడు తిరుపోరూర్‌ ఆలయ ప్రాంగణంలో బాంబు పేలుడు.. ఒకరి మృతి

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులో ఆదివారం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. తిరుపోరూర్‌ ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పేలుడుపై దర్యాప్తు చేపడుతున్నారు.

ఆలయంలో పేలింది పార్సిల్‌ బాంబ్‌గా గుర్తించారు పోలీసులు. ఆలయ సమీపంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబు దాడి ఎవరు చేసి ఉంటారు..? దాడికి కుట్ర పన్నిందెవరు..? దాడిలో ఉగ్రవాదుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు.