తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించిన నిఘావర్గాలు!

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు రాష్ట్రంలో నిఘావర్గాలు హై అలర్ట్ ప్రకటించారు. శ్రీలంక మీదుగా ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి చొరబడినట్లు సమాచారం ఉండడంతో నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. చెన్నైతో సహా కోయంబత్తూర్ ప్రధాన పట్టణాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెన్నై సీపీ తెలిపారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ సహా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.