న్యాయం కోసం ఆయన తరఫున పోరాడతాం…ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరం: ప్రియాంకా గాంధీ

వాస్తవం ప్రతినిధి: ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పి.చిదంబరంనును అలా అగౌరవపరచడం అన్యాయమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ప్రియాంకా గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘ అత్యంత గౌరవనీయులైన రాజ్యసభ సభ్యుడు పి.చిదంబరం. దశాబ్దాలుగా ఆయన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆర్థిక, హోం మంత్రిగా ఆయన ఎన్నో విలువైన సేవలు చేశారు. నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడే వ్యక్తి ఆయన. ఇప్పటి ప్రభుత్వ వైఫల్యాలను బాహాటంగా ఎండగడుతున్నారు ‘ అని ట్వీట్‌ చేశారు.

‘ కొందరు పిరికిపందల వల్లే ఇలా నిజాలు మాట్లాడే వారిపై నిందలు పడుతున్నాయి. ఆయన పట్ల సిబిఐ తీరు అవమానకరమైంది. మేం ఆయనకు మద్దతుగా నిలుస్తాం. న్యాయం కోసం ఆయన తరఫున పోరాడతాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరం ‘ అని ప్రియాంకా మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.