శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం

వాస్తవం ప్రతినిధి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,315 మంది భక్తులు దర్శించున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.