కాశ్మీర్ విషయంలో ట్రంప్ మళ్లీ అదే మాటన్నారు!

వాస్తవం ప్రతినిధి: ట్రంప్ మళ్లీ అదే మాటన్నారు. కాశ్మీర్ విషయంలో ఆయన మాట రోజుకో రకంగా మారుతున్న తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన మధ్య మధ్యవర్తిత్వానికి తాను రెడీ అంటూ ఈ రోజు మరోసారి తన వాచాలత ప్రదర్శించారు. ఇటీవలే ఇలా మాట్లాడి నాలుక కరుచుకున్న ట్రంప్ మళ్లీ ఈ రోజు మధ్యవర్తిత్వం మాట ఎత్తారు. కాశ్మీర్ భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక అంశమని చెబుతూనే ఆ రెండు దేశాలూ కోరితే మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ మాట్లాడటం విమర్శలకు తావిచ్చింది. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయం చెప్పారు.