డియర్ బీజేపీ…. హరీష్ రావుతో తస్మాత్ జాగ్రత్త..!

 వాస్తవం ప్రతినిధి: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి కేవలం ఒక మతానికి చెందిన పార్టీ అనే ముద్ర ఉంది. అంతేకాకుండా ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తారని చాలా సందర్భాలలో వివిధ పార్టీల రాజకీయ నేతలు కూడా బహిరంగంగానే మీడియా ముందు పేర్కొనడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ కి వెన్నులో వణుకు పుట్టిస్తూ రాజకీయాలు చేస్తున్న బిజెపి..త్వరలో వినాయక చవితి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కొత్త స్ట్రాటజీ వేసినట్లు తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ఇటువంటి నేపథ్యంలో బిజెపి పార్టీకి మతి పోయే విధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజలలో ఎటువంటి గొడవలు మతపరంగా గాని మరే పరంగా గానీ చోటు చేసుకోకుండా తన నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అదేమిటంటే ‘ఏక వినాయక మహోత్సవం’.

త్వరలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక చోట ఒక విగ్రహాన్ని నిలబెట్టుకుని అది కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని పండుగ చేసుకోవాలని సూచించారట. కులాలు సంఘాలు కాలనీల వారీగా ప్రజలు విడిపోకుండా ఈ వినాయక చవితి పండుగను ఐకమత్యానికి నిదర్శనంగా సిద్ధిపేట ప్రజలు చేసుకోవాలని తన నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో మెజారిటీ ఇచ్చిన ప్రజలకు హరీష్ సూచించారట. ఎక్కడ ఏ చోట రాజకీయ గొడవలుకు ఆస్కారం లేకుండా పండుగను ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని హరీష్ రావు నియోజకవర్గంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలకు తెలిపారట. తెలంగాణలో మెల్లమెల్లగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న స్థానాలలో బలపడుతున్న బిజెపి పార్టీకి…ఆ పార్టీలో ఉన్న నేతలు కొంత మంది హరీష్ రావు తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేటలో ఏ విధమైన స్ట్రాటజీ వేసినా ప్రజలు హరీష్ రావు నే నమ్ముతారని..పేర్కొంటున్నారు.